ఏపీ ఎంసెట్ 2020 నోటిఫికేషన్ | AP EAMCET 2020 ఆన్లైన్ అప్లికేషన్: ఏపీ ఎంసెట్ ఆంధ్ర ప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020. జవహార్ లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ 2020-2021 విద్యాసంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ ఎంసెట్ ప్రవేశ పరీక్ష కొరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి 29 ఫిబ్రవరి 2020 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సులలో మొదటి సంవత్సరం ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. మొదటిగా అప్లికేషన్ ఆన్లైన్ చేయడానికి చివరి తేదీగా 29 మార్చి 2020 అని పేర్కొన్నప్పటికీ, రాష్ట్రంలో మరియు దేశంలో కరోనా లాక్ డౌన్ కారణంగా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 జూన్ 2020 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీ ఎంసెట్ 2020 పరీక్ష తేదీలు కూడా పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. లాక్ డౌన్ అయిన తరువాత పరీక్షకు సంబంధించిన తేదీలు వెలువడే అవకాశం ఉంది.
ఏపీ ఎంసెట్ 2020 నోటిఫికేషన్
AP EAMCET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | జె.ఎన్.టి.యు, కాకినాడ |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 29 ఫిబ్రవరి 2020 |
అప్లికేషన్ ముగింపు తేది | 15 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | ప్రకటించవలసి ఉంది |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | sche.ap.gov.in/emcet |
కోర్సులు:
Engineering, Bio – Technology, B.Tech (Dairy Technology), B.Tech (Agrl. Engg.) BTech (Food Science and Technology) B.Sc (Ag) / B.Sc. (Hort) / B.V.Sc. & A.H / B.F.Sc B.Pharmacy, Pharm. D
ఇంజనీరింగ్ విభాగము అర్హత:
మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ (ఎంపీసి )ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పాసైన అభ్యర్థులు అర్హులు
అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగము అర్హత:
బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ బైపిసి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
ఏపీ ఎంసెట్ 2020 ఫీజు:
ఇంజనీరింగ్ విభాగం వారికి Rs. 500/-
అగ్రికల్చర్ విభాగం వారికి Rs. 500/-
ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ – Rs. 1000/-
ఏపీ ఎంసెట్ 2020 నోటిఫికేషన్ & ఆన్లైన్ అప్లికేషన్
అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here