AP Police SI Syllabus: ఏపీ పోలీస్ ఎస్ఐ జాబ్ రిక్రూట్మెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB), సెలక్షన్ మరియు పరీక్ష బాధ్యతలను నిర్వహిస్తుంది. ఏపీ ఎస్ఐ జాబ్ క్యాటగిరి వైజ్ మనకి సివిల్, ఏఆర్, ఏపీఎస్పి, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇలా కేటగిరీల వారిగా ఎస్సై పోస్టులు ఉంటాయి. ఏపీ పోలీస్ ఎస్ఐ రిక్రూట్మెంట్ మనకి 3 దశల్లో జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ పరీక్షలో రాత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రెండు టెస్టుల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఫైనల్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
ఏపీ పోలీస్ ఎస్ఐ సిలబస్ | AP Police SI Syllabus
AP Police SI Syllabus | |
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(APSLPRB) |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఎస్ఐ |
మొత్తం ఖాళీల సంఖ్య | ప్రకటించబడవలసి ఉంది |
ప్రారంభ తేదీ | ప్రకటించబడవలసి ఉంది |
ముగింపు తేది | ప్రకటించబడవలసి ఉంది |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | slprb.ap.gov.in |
AP SI Exam Pattern (ఏపీ పోలీస్ ఎస్ఐ పరీక్షా విధానం) :
AP SI Prelims Exam Pattern (ఏపీ పోలీస్ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షా విధానం)
ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1: అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ – 100 మార్కులు 100 ప్రశ్నలు
పేపర్ 2: జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు 100 మార్కులు.
ఇక్కడ అభ్యర్థులు పేపర్-1 పేపర్-2 పేపర్స్ క్వాలిఫై ఇవ్వాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ రెండిటిలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు.
AP SI Mains Exam Pattern (ఏపీ పోలీస్ ఎస్ఐ ఫైనల్ రాత పరీక్షా విధానం)
ఏపీ పోలీస్ ఎస్ఐ ఫైనల్ రాత పరీక్ష లో నాలుగు పేపర్లు ఉంటాయి.
పేపర్ – 1: ఇంగ్లీష్
పేపర్ – 2: తెలుగు
పేపర్ – 3: అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ
పేపర్ – 4: జనరల్ స్టడీస్
ఇవి నాలుగు పేపర్ లో ఉండే సబ్జెక్టులు. పేపర్ -1 మరియు పేపర్-2 లో క్వాలిఫై మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. పేపర్-3 మరియు పేపర్-4 లో వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకుని సెలక్షన్స్ జరుగుతాయి.
AP Police SI Syllabus:
ఏపీ పోలీస్ ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష సిలబస్: Click Here
ఏపీ పోలీస్ ఎస్ఐ మెయిన్స్ పరీక్ష సిలబస్: Click Here
ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్: Click Here