తెలంగాణ ఈసెట్ 2020: తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ECET) 2020 పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరుపున JNTU హైదరాబాద్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. డిప్లొమా మరియు B.Sc మ్యాథమెటిక్స్ డిగ్రీ విద్యార్థులు లేటర్ ఎంట్రీ ప్రవేశ పద్ధతి లో బీఈ, బీటెక్, బి ఫార్మసీ కోర్సులలో రెండవ సంవత్సరం ప్రవేశాలు కొరకు నిర్వహించే TS ఈసెట్ 2020 ఆన్లైన్ అప్లికేషన్ 24 ఫిబ్రవరి 2020 నుంచి ప్రారంభమైనవి. TS ECET అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయడానికి చివరి తేదీ (ముందు నిర్ణయించిన దాని ప్రకారం) మార్చి 28 2020. ఈ తేదీ ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కారణంగా అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయడానికి అపరాధ రుసుము లేకుండా 10 జూన్ 2020 వరకు పొడిగించడం జరిగింది. అలాగే 2 మే 2020 న జరగాల్సిన టిఎస్ ఈసెట్ 2020 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పరీక్ష మే నెల చివరి వారంలో జరిగే అవకాశం ఉంది అయినప్పటికీ అధికారిక పరీక్ష తేదీ 4 జూలై 2020.
తెలంగాణ ఈసెట్ 2020 | TS ECET అప్లికేషన్ ఫారం
Telangana ECET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS ECET) 2020 |
యూనివర్సిటీ పేరు | జె.ఎన్.టి.యు, హైదరాబాద్ |
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ | 20 ఫిబ్రవరి 2020 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 24 ఫిబ్రవరి 2020 |
అప్లికేషన్ ముగింపు తేది | 10 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | 4 జూలై 2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | ecet.tsche.ac.in |
తెలంగాణ ఈసెట్ 2020 ఫీజు:
- ఎస్సీ, ఎస్టీ మరియు పి హెచ్ కేటగిరి అభ్యర్థులకు Rs.400/-
- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు Rs. 800/-
తెలంగాణ స్టేట్ ఈసెట్ అర్హత:
డిప్లొమా మరియు బిఎస్సి మ్యాథమెటిక్స్ ఇన్ డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు.
TS ECET 2020 నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం
అధికారిక నోటిఫికేషన్: క్లిక్ చేయండి
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: క్లిక్ చేయండి