TS Police SI Syllabus: తెలంగాణ పోలీస్ ఎస్ఐ సిలబస్ మరియు జాబ్ రిక్రూట్మెంట్ నిర్వహణ బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక సంస్థ( TSLPRB ) నిర్వహిస్తుంది. టిఎస్ పోలీస్ ఎస్ఐ సంబంధించి పరీక్ష విధానం ఎలా ఉంటుంది అనేవి పూర్తిగా మనం ఇక్కడ తెలుసుకుందాం. పరీక్ష రాసే ముందు పరీక్ష పేపర్ ఎలా ఉంటుంది అలాగే పరీక్షకు సంబంధించిన సిలబస్ ఏమి ఇచ్చారు అనే వాటిపై మనకి పూర్తి అవగాహన ఉన్నట్లయితే ఎగ్జామ్ ప్రిపరేషన్ కి ఇది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఎస్ఐ సివిల్ లేదా ఇతర సమాన అర్హతలు కలిగిన ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానం ఇప్పుడు ప్రిలిమినరీ పరీక్ష అలాగే మెయిన్స్ పరీక్ష కింద జరుగుతున్నాయి.
తెలంగాణ పోలీస్ ఎస్ఐ సిలబస్ | TS Police SI Syllabus
Telangana Police SI Syllabus 2020 | |
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) |
పరీక్ష పేరు | తెలంగాణ పోలీస్ ఎస్ఐ |
మొత్తం ఖాళీల సంఖ్య | ప్రకటించబడవలసి ఉంది |
ప్రారంభ తేదీ | ప్రకటించబడవలసి ఉంది |
ముగింపు తేది | ప్రకటించబడవలసి ఉంది |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | tslprb.in |
అర్హత (Telangana Police SI Eligibility):
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష విధానం(TS Police SI Exam Pattern):
● ప్రిలిమినరీ పరీక్ష (Prelims Exam)
● ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT) & ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) (Physical Exam)
● ఫైనల్ రాతపరీక్ష(Mains Exam)
తెలంగాణ పోలీస్ ఎస్ఐ సిలబస్, పరీక్ష విధానం ( TS Police SI Syllabus ):
ప్రిలిమినరీ రాతపరీక్ష :
– అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ /మెంటల్ ఎబిలిటీ 100 ప్రశ్నలు
– జనరల్ స్టడీస్ 100 ప్రశ్నలు
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష క్వాలిఫై అయిన వారు ఫిజికల్ టెస్ట్ కి అర్హత సాధిస్తారు. ఫిజికల్ టెస్ట్ లో పాసైన అభ్యర్ధులకు ఫైనల్ రాత పరీక్షకు అర్హులు.
ఫైనల్ రాతపరీక్ష :
తెలంగాణ ఎస్సై మెయిన్స్ (ఫైనల్) రాత పరీక్ష నాలుగు పేపర్లు గా డిమాండ్ చేశారు.
పేపర్-1 : ఇంగ్లీష్ – 200 ప్రశ్నలు 100 మార్కులు
పేపర్ – 2 : తెలుగు/ ఉర్దూ – 200 ప్రశ్నలు 100 మార్కులు
పేపర్ – 3 : అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 200 ప్రశ్నలు 200 మార్కు లు
పేపర్ – 4: జనరల్ స్టడీస్ 200 ప్రశ్నలు 200 మార్కులు
పేపర్ 1 మరియు పేపర్ 2 క్వాలిఫై మార్కులు సాదిస్తే సరిపోతుంది. పేపర్ 3 & పేపర్ 4 వచ్చిన మార్కులు ఆదారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు.
తెలంగాణ ఎస్ఐ పరీక్ష సిలబస్ (TS Sub Inspector Exam Syllabus PDF) : Click Here
తెలంగాణ టెక్నికల్ ఎస్ఐ పరీక్ష సిలబస్: Click Here
తెలంగాణ ఎస్ఐ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్: Click Here