తెలంగాణ టెట్ సిలబస్ | TS TET Syllabus (Paper 1, Paper 2) PDF Download

Telangana tet syllabus telugu

టిఎస్ టెట్ సిలబస్ | TS TET Syllabusతెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS TET): తెలంగాణ లో టీచర్ ఉద్యోగాల భర్తికి నిర్వహించే అర్హత పరీక్ష తెలంగాణ టెట్ 2020. టిఎస్ టెట్ మనకి డిపార్టుమెంట్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ నిర్వహిస్తుంది. టెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే డీఎస్సీ పరీక్ష రాయడానికి అర్హులు కాబట్టి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ చాలా ముఖ్యం. అలాగే టెట్ లో వచ్చిన మార్కులు డీఎస్సీ లో 20 శాతం వెయిటేజీ కూడా ఉంది కాబట్టి టెట్ పరీక్షలో అర్హత సాధించడమే కాకుండా ఎక్కువ మార్కులు తెచ్చుకోవలసి ఉంటుంది.

తెలంగాణ టెట్ సిలబస్ | TS TET Syllabus

TS TET Syllabus 2020
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు డిపార్టుమెంట్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ
పరీక్ష పేరు తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET)
కేటగిరి సిలబస్
వెబ్సైటు tstet.cgg.gov.in

 

టిఎస్ టెట్ పరీక్ష విధానం:

తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష మనకి రెండు పేపర్లుగా ఉంటుంది.

పేపర్-1 : డీఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఎలిజిబిలిటీ పరీక్షగా టిఎస్ టెట్ పేపర్-1 రాయవలసి ఉంటుంది.పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది 150 ప్రశ్నలు ఉంటాయి సమయం రెండున్నర గంటలు.

పేపర్-2 : బీఈడి పూర్తిచేసిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే
టిఎస్ టెట్ పేపర్-2 పరీక్ష రాయవలసి ఉంటుంది. పరీక్ష 150 ప్రశ్నలు 150 మార్కులు. పరీక్ష సమయం రెండున్నర గంటలు.

టిఎస్ టెట్ సిలబస్ | TS TET Syllabus (Paper 1 & 2)

తెలంగాణ టెట్ సిలబస్:

పేపర్ -1 :

  • చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 1 – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 2 ( ఇంగ్లీష్ ) – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • మ్యాథమెటిక్స్ – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • ఎన్విరాన్మెంటల్ స్టడీస్ – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు.

పేపర్ – 2 :

  • చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 1 – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 2 ( ఇంగ్లీష్ ) – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ కోసం మ్యాథ్స్ ,సైన్స్ – 60ప్రశ్నలు 60మార్కులు
  • సోషల్ స్టడీస్ టీచర్స్ కి సోషల్ స్టడీస్ – 60ప్రశ్నలు 60మార్కులు

మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు.

తెలంగాణ టెట్ సిలబస్ | TS TET Syllabus

టిఎస్ టెట్ పేపర్-1 సిలబస్ : Click Here

టిఎస్ టెట్ పేపర్ 2 సిలబస్ : Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here